గోవింద మయం
🙏 గోవింద మయం .. ..అనేది ఒక పద ప్రక్రియ కాదు
గోవింద మయం .. అంటే శ్రీనివాసుడి సేవలొ తరించడం
ఆ దేవదేవుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం
నిత్యం ఆ గోవింద నామస్మరణని జపించడం
“గోవింద మయం దీక్ష” ని 3 రోజులు, 5 లేక, 7, 9, 11, లేక 21 రోజులు నియమ నిష్ఠ లతో చేసుకోవచ్చు
దీక్షని ఎక్కువ రోజులు చేయ సంకలించినవారు 41 రోజులు లేక 71, 111, లేక పూర్తిగ సంవత్సర కాలం వారి వారి అనుకూలతను బట్టి దీక్షని చెసుకోవచ్చు
పూజ చేయు విధానం:
1. శాకహార భోజనం మాత్రమే తీసుకోవాలి
2. మాంసాహారం, మందుపానీయాలు తీసుకోరాదు
3. గృహస్థ వృత్తి ధర్మాలు పాటిస్తూ ఇతరులకు సహాయం చేయవలెను
4. అబద్ధాలాడరాదు, అసూయ, కోపం విడనాడవలెను
5. మోసపూరిత చర్యలు చేయరాదు
6. నిత్యము గోవింద నామస్మరణ చేయవలెను
7. నిత్య పూజ లొ శ్రీనివాసుని జపించవలేను (గోవిందనామాలు / విష్ణు సహస్రనామం …)
8. దీక్ష చివరి రోజున తల స్నానం చేసి హిందూ సంప్రదాయ వస్త్రాలు (పంచె, కండువ..) ధరించి, స్వామి వారికి ప్రీతిపాత్రమైన వంటలతొ నైవేద్యం సమర్పించి, ఇంటిల్లపాది లేదా ప్రార్థన మందిరాల్లోను, గుళ్ళలొ కాని బంధుమిత్రులతొ కలసి భక్తిశ్రద్ధలతొ పూజ చేసుకుని, ఆ దేవదేవుని ఆశిస్సులు పొందగలరు. 🙏
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏